»Iba Proposed 15 Percent Salary Hike To Government Bank Employees And Five Days Working
Bank Emplyees Salary Hike: గుడ్ న్యూస్.. వారంలో 5రోజులే పని.. 15శాతం జీతం పెంపు
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ , కొన్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే వీలున్నట్లు తెలుస్తోంది.
Bank Emplyees Salary Hike: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ , కొన్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉద్యోగులకు జీతాలు పెంచాలని ప్రతిపాదన వచ్చింది. దీంతో పాటు ఇతర మార్పులు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే PNB వంటి కొన్ని బ్యాంకులు ఉద్యోగులకు జీతాలు పెంచాలని కొంత మేర నిధులు కేటాయించాయి. అయితే ఈ బ్యాంకులు వేతనాలను 10 శాతం పెంచేందుకు ప్రత్యేక బడ్జెట్ను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం ఐబీఏ తీసుకొచ్చిన 15శాతం జీతం పెరుగుదల అంశం అమలైతే బ్యాంక్ ఉద్యోగుల జీతం 25శాతం పెరుగుతుంది.
కరోనా మహమ్మారి తర్వాత నుంచి బ్యాంకులన్నీ భారీ లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా 2024 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకులు మంచి ఫలితాలు రాబట్టాయి. కోవిడ్ తర్వాత రుణదాతలను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడంలో, ప్రభుత్వం పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. దీంతో ఉద్యోగులు ఇలాంటి పరిహారానికి అర్హులు. అందుకే వారి జీతంలో పెరుగుదల కనీసం 15 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలోపు ఉద్యోగుల జీతాల పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వంతో మూడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత 2020లో చివరిసారిగా బ్యాంక్ ఉద్యోగుల జీతాన్ని పెంచారు. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల నిబంధన అమలు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పనివేళలు పెరగడంతో పాటు వారంలో రెండు రోజులు సెలవులు వస్తాయి.