క్యూబా విప్లవయోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉంది.
ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్ కు వెళ్లనున్నారు. రవీంద్రభారతి వద్ద చేగువేరా కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.