»Traffic Jam In Space 10 Lakh Satellites Are At Risk Of Collision
Space: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్..10 లక్షలు ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం!
త్వరలో అంతరిక్షంలో 10 లక్షలకు పైనే శాటిలైట్స్ చేరుకోనున్నాయి. దీని వల్ల అంతరిక్షంలో ఒక గ్రహంతో పాటు మరో గ్రహం ఢీకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
అంతరిక్షంలో (Space) ఉపగ్రహాల (Satellite) సంఖ్య ఎక్కువవుతోంది. రాబోయే రోజుల్లో దేశాలు, కంపెనీల మధ్య కూడా అంతరిక్ష పోరు (Space War) నెలకొనే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి అనేక ఉపగ్రహాల ప్రయోగానికి వివిధ దేశాలు పోటీపడుతున్నాయి. శాటిలైట్లను పంపేందుకు అనేక దేశాలు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. దీంతో లక్షల శాటిలైట్ల కారణంగా అంతరిక్షంలో కాంతి కాలుష్యం భారీగా సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు (Scientists) హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భారీ సంఖ్యలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ పోతుంటే దేశాల మధ్య అంతరిక్ష ఘర్షణలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాంతి కాలుష్యం వల్ల అనే నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అంతరిక్షంలోకి లక్షల సంఖ్యలో శాటిలైట్లను (Satellites) పంపితే అవి ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
కెనడా (Canada)లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు (Columbia University) ఈ మేరకు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో శాటిలైట్లు మరింత పెరుగుతాయని, దానివల్ల అవి అంతరిక్షంలో ఢీకొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు అంచనా వేశారు. అంతరిక్షంలోకి రాకెట్ల (Rockets)ను పంపేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్లు (Communications Satellites) అధికం కావడంతో త్వరలో వాటి నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ఎర్త్ ఆర్బిట్ (Earth Orbit)లో ఉన్న శాటిలైట్ల కంటే ఇది 115 రెట్లు మరింత ఎక్కువ ఉందని వారు భయపడుతున్నారు. త్వరలోనే అంతరిక్షంలో ఉపగ్రహాలు 10 లక్షలకు (10 Lakshs satellites) చేరువయ్యే అవకాశం ఉందని, వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్ష ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఎర్త్ ఆర్బిట్ లోకి పంపే శాటిలైట్ల సంఖ్యను తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.