దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉంది. అంతర్జాతీయంగా ఈ సినిమాకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట చాలా ఫేమస్ అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటలో అద్భుతంగా నటించారు. ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ వంటి ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది.
తాజాగా ‘నాటునాటు’ పాటకు రామ్ చరణ్ అత్త శోభన కామినేని డ్యాన్స్ వేసింది. రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన తల్లి శోభన కామినేని ఈ పాటకు డ్యాన్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.