తమిళనాడు (Tamilnadu)లో దారుణం జరిగింది. ఘోర అగ్ని ప్రమాదంలో (Fire Accident) 9 మంది దుర్మరణం చెందారు. అరియలూరు జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రం (Fireworks Manufacturing Centre)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) స్పందించారు. సంతాపం తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియోను (Exgratia) ప్రకటించారు.
అగ్ని ప్రమాదం (Fire accident)లో చనిపోయినవారి కుటుంబాలకు రూ.3 లక్షలు, ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియోను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని విరగలూరు గ్రామంలో ఓ ప్రైవేటు బాణాసంచా యూనిట్లో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదని పోలీసులు వెల్లడించారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తంజావూరు (Thanjavur)లోని మెడికల్ కాలేజీ (Medical College)లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.