»We Will Blow Up Narendra Modi Stadium On October 5 Warned Khalistan Terrorist
khalistan: అక్టోబర్ 5న నరేంద్రమోదీ స్టేడియాన్ని పేల్చేస్తాం..హెచ్చరించిన ఖలిస్థాన్ టెర్రరిస్ట్
ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో తాజాగా ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఖలిస్థాన్ టెర్రరిస్టు అయిన గుర్పత్వంత్ సింగ్ పన్ను ఆ ఆడియోలో భారత్‌ను బెదిరించాడు. వరల్డ్ కప్‌లో మారణహోమం సృష్టిస్తామని హెచ్చరించాడు.
ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో తాజాగా ఖలిస్థాన్ టెర్రరిస్టు గుర్పత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీ చేస్తూ ఓ ఆడియో వైరల్ అవుతోంది. ముందుగానే రికార్డ్ చేసిన ఆ ఆడియోలో భారత్‌కు, ప్రధాని నరేంద్రమోదీకి అందులో హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ ఆడియోలో పన్ను హెచ్చరించాడు.
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబర్ 5వ తేదిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరుణంలో ఆ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. నిజ్జర్ హత్యపై తాము ఇండియా బుల్లెట్‌కు వ్యతిరేకంగా తమ బ్యాలెట్‌ను ఉపయోగించబోతున్నామని హెచ్చరించారు. అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, అది ప్రపంచ టెర్రర్ కప్‌కు నాంది అని ఆ ఆడియోలో ఉంది. ఆడియోలోని వాయిస్ గుర్పత్వంత్ సింగ్ పన్ను చెప్పిందని ఆ రికార్డింగ్‌లో నమోదై ఉంది.
అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను కూడా హత్య చేయనున్నట్లు ఆ ఆడియోలో హెచ్చరించాడు. వర్మను భారత్‌కు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అని, అందరికీ బుద్ది చెబుతామని ఆడియోలో తెలిపాడు.