»Income Tax Return Government Extended The Date For Filing Itr For These People New Date Is 30th November
Income Tax Return: టాక్స్ పేయర్స్ కు గుడ్ న్యూస్.. ఐటీఆర్ దాఖలు తేదీ పొడగింపు.. లాస్ట్ డేట్ నవంబర్ 30
ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని ప్రభుత్వం ఇప్పుడు నవంబర్ 30గా నిర్ణయించింది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
Big update for ITR filers.. This information given by income tax department is for you..
Income Tax Return: ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు తేదీని పొడిగించింది. అయితే, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాదు. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని ప్రభుత్వం ఇప్పుడు నవంబర్ 30గా నిర్ణయించింది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి కంపెనీలు చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడిగించినట్లు సోమవారం ప్రభుత్వం తెలిపింది. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన కంపెనీలకు, ఆడిట్ నివేదికను సమర్పించడానికి గడువు తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించారు.
2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి ఫారమ్ ఐటీఆర్-7లో ఆదాయ రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని 31.10.2023 నుండి 30.11.2023 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం తన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి జూలై 31 వరకు రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. అందులో 53.67 లక్షలు మొదటిసారి ఐటీఆర్ చేసిన వారున్నారు.
జూలై 31, 2023న ఐటిఆర్ ఫైలింగ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒకే రోజులో 64.33 లక్షలకు పైగా ఐటిఆర్‌లు దాఖలు చేయబడ్డాయి. జూలై 31, 2023 వరకు మొదటిసారిగా ఫైల్ చేసిన వారి నుండి డిపార్ట్మెంట్ 53.67 లక్షల ఐటీఆర్‌లను పొందిందని డిపార్ట్మెంట్ తెలిపింది. 6.77 కోట్ల ఐటీఆర్‌లలో 5.63 కోట్ల రిటర్న్‌లు ఇ-వెరిఫై చేయబడ్డాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ ఐటీఆర్ యుటిలిటీని ఉపయోగించి 46 శాతానికి పైగా ఐటీఆర్‌లు దాఖలు చేయబడ్డాయి.