»Exclusive Tata Curvv Coupe Suv Nears Production What To Expect
Tata Curvv Features: త్వరలోనే టాటా నుంచి సరికొత్త కర్వ్ కూపే SUV
టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో తమ సరికొత్త కర్వ్ కూపే ఎస్ యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ మోడల్ కంపెనీ రాబోయే మీడియం రేంజ్ ఎస్ యూవీని సూచిస్తుంది.
Tata Curvv Features: టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో తమ సరికొత్త కర్వ్ కూపే ఎస్ యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ మోడల్ కంపెనీ రాబోయే మీడియం రేంజ్ ఎస్ యూవీని సూచిస్తుంది. ఇందులో కొత్త డిజిటల్ డిజైన్ లాంగ్వేజ్‌తో కొత్త తరం ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ డిజైన్ కనిపిస్తుంది. దాని ఉత్పత్తి మోడల్ ICE, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇటీవల టాటా కర్వ్ అనేక చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో CNG ఫ్యూయల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని చూపిస్తుంది.
ఇంటీరియర్
దాని డాష్‌బోర్డ్‌లోని ఇంటిగ్రేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్లో CNG బటన్ అందించబడుతుంది. అదనంగా ఇది రెండు ఫ్రంట్ టోగుల్స్, ఆటో పార్క్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరాతో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సెటప్‌ను పొందుతుంది. ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, మూడు-లేయర్ డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ ఫ్రీ-స్టాండింగ్ డిజిటల్ స్క్రీన్లు (ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు ఒకటి ,ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌కు ఒకటి), పనోరమిక్ సన్‌రూఫ్, సహా కాన్సెప్ట్ మోడల్లో చూపిన అన్ని ఫీచర్లను ప్రొడక్షన్ మోడల్ పొందవచ్చని భావిస్తున్నారు. రోటరీ గేర్ సెలెక్టర్, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ చేర్చబడ్డాయి.
పవర్ట్రైన్
కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్ 400-500కిమీల పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే దాని బ్యాటరీ ప్యాక్, పవర్, టార్క్ అవుట్‌పుట్ వివరాలు వెల్లడించలేదు. కానీ ఇది Nexon EV కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. అయితే దాని ICE మోడల్ 1.2 లీటర్ DI టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 125bhp శక్తిని, 225Nm టార్క్‌ను పొందుతుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ట్విన్ సిలిండర్ CNG
టాటా కర్వ్ CNG వెర్షన్లో పరిచయం చేయబడితే Altroz CNGలో చూసినట్లుగా కంపెనీ కొత్త ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈ సాంకేతికత పంచ్ CNG, Nexon CNG మోడళ్లలో కూడా ఉపయోగించబడుతుంది. ఈ కారు 2024లో విడుదల కానుంది.
ఎవరితో పోటీ ?
ఈ కర్వ్ SUV హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి SUVలతో పోటీపడుతుంది. హ్యుందాయ్ తన క్రెటాను త్వరలో అప్డేట్ చేయబోతోంది. ఇందులో మూడు ఇంజన్ ఎంపికలు ఉంటాయి. అయితే గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో సహా CNG వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది.