నేడు తిరుపతి జిల్లా (Tirupathi District)లో సీఎం జగన్ (Cm Jagan) పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ (Srinivasa Setu FlyOver)ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి మణిహారంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిలుస్తుందన్నారు.
ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ప్రాజెక్టును తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ (TTD) సంయుక్తంగా చేపట్టిందన్నారు. శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. ఈ శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లు కాగా దీని పొడవు సుమారు 7.34 కిలోమీటర్లుగా ఉందని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు.
2019 మార్చిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ (Srinivasa Setu FlyOver) నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ రూ.458 కోట్లు ఖర్చు చేసిందని సీఎం జగన్ తెలిపారు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ భవనాలను కూడా ప్రారంభించారు. కాగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Srivari Bramhotsavalu) నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.