»Andhra Pradesh Government Introduced Acb 14400 App For Fight Against Corruption
ACB APP: ఎవరైనా లంచం అడిగితే 14400కు ఫోన్ కొట్టు.. గిఫ్ట్ పట్టు
ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపు మాపేందుకు జగన్ సర్కార్ కీలకనిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిశ యాప్‌తో సంచలనం సృష్టించిన సర్కార్ అవినీతిపై కూడా అదే స్థాయిలో పోరాటానికి సిద్ధం అయింది. దీనికి అనుగుణంగానే ఏసీబీ 14400 పేరుతో యాప్‌ను రూపొందించింది.
ACB APP: ప్రస్తుతం సమాజంలో అవినీతి ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో చిన్న పని జరగాలన్నా చేయి తడపనిదే పని కాదన్న విషయం చిన్న పిల్లోడికి కూడా తెలుసు. అలా ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపు మాపేందుకు జగన్ సర్కార్ కీలకనిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిశ యాప్‌తో సంచలనం సృష్టించిన సర్కార్ అవినీతిపై కూడా అదే స్థాయిలో పోరాటానికి సిద్ధం అయింది. దీనికి అనుగుణంగానే ఏసీబీ 14400 పేరుతో యాప్‌ను రూపొందించింది. అవినీతి నిర్మూలనకు ఏసీబీ తీసుకొచ్చిన సరికొత్త యాప్‌ను సీఎం జగన్ గతంలో ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎక్కడా అవినీతి ఉండకూడదన్న మాట చెబుతున్నామని.. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం జగన్.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చిన ముఖ్యమంత్రి జగన్. కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, మండల ఆఫీస్, పోలీస్ స్టేషన్, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగే పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదన్నారు జగన్. ఎవరైనా లంచం అని అడిగితే వెంటనే ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి… బటన్ ప్రెస్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వీడియో ద్వారా కాని, ఆడియో ద్వారా కాని సంభాషణను రికార్డు చేస్తే దానిని నేరుగా ఏసీబీకి పంపాలన్నారు.
ఆ సమాచారం ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో తమ వంతు బాధ్యత ఉందన్నారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమదైన శైలిలో స్పందిస్తే కనీసం 50శాతం అవినీతి అంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతి లేని పాలన అందరి కర్తవ్యం అన్నారు. ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ హెచ్చరించారు. అంతేకాకుండా ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 నెంబర్ కి ఫోన్ చేస్తే చేసిన వ్యక్తులకు ప్రోత్సాహకం కింద రూ. 5000 నుoచి రూ.10000 రూ ఇవ్వనున్నారు.
యాప్ ఎలా పనిచేస్తుందంటే?
ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్లోడ్ చేయగానే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్ చేయగానే వాడకానికి సిద్ధంగా ఉంటుంది.
యాప్‌లో రెండు కీలక ఫీచర్లు ఉన్నాయి. యాప్ ద్వారా అవినీతికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా రికార్డు చేసి అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లాడ్జి ఫిర్యాదు ఫీచర్ ద్వారా అవినీతి కేసుకు సంబంధించి.. ఫిర్యాదుకు దగ్గరగా ఉన్న పత్రాలు, వీడియో, ఆడియో, ఫోటో ఆధారాలను ఏసీబీకి పంపవచ్చు. ఫిర్యాదు నమోదైన తర్వాత, మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబర్ పంపబడుతుంది. త్వరలో ఐఓఎస్ వెర్షన్లో యాప్‌ను ఏసీబీ సిద్ధం చేస్తోంది.