»Students Tied Rakhi To Jawans Bsf Army In Jammu And Kashmir Emotional Video
Raksha bandhan 2023: జవాన్లకు రాఖీ కట్టిన విద్యార్థులు..ఎమోషనల్ వీడియో
ఇండియా ఎల్లప్పుడు రక్షణగా ఉంటున్న జమ్ము కశ్మీర్ బార్డర్లో ఉన్న జవాన్లకు అక్కడి విద్యార్థులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రతి భారతీయుడిని ఎమోషనల్కు గురిచేస్తుంది.
raksha bandhan 2023: భారతదేశ(India) సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశాన్ని అనుక్షణం శత్రుమూకల నుంచి రక్షిస్తున్న ఆర్మీ(Army)కి వారి గుడారాలే ఇంద్రభవనాలు. చుట్టు ఉన్న ప్రాంతవాసులే వారి బంధువులు. దేశాన్ని, ప్రజలను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే వారిని ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సొంత కుటుంబంలా చూసుకుంటారు. ఈ రోజు దేశమంతా రాఖీ పండుగ(Rakhi) జరుపుకుంటున్న సందర్భంగా.. మన ప్రాణాలను కాపాడుతున్న జవాన్లకు పాఠశాల విద్యార్థులు, పిల్లలు వెళ్లి రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జమ్ము కశ్మీర్ ఎల్ఓసీ ప్రాంతంలోని సైనికులకు, అలాగే బీఎస్ఎఫ్ సైనికులకు స్టూడెంట్స్ రాఖీ కట్టి వారికి రక్షబంధన్ శుభాకాంక్షలు చెప్పి, దేశం, జవాన్లపై వారికున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు.