ప్రస్తుతం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హంగామా ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ముందు నుంచి ప్రతి విషయంలోను పోటీ పడుతు వచ్చారు చిరు బాలయ్య. అందుకు తగ్గట్టే మైత్రీ మూవీ మేకర్స్ కూడా.. అటు ఫ్యాన్స్.. ఇటు చిరు, బాలయ్యను ఏ మాత్రం హర్ట్ చేయకుండా భలేగా బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ లుక్ మొదలుకొని.. రిలీజ్ వరకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగారు. అలాగే సినిమాల పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ విషయంలో మెగా, నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకు తగ్గట్టే వీరసింహారెడ్డి రిజల్ట్ మరింత కిక్ ఇస్తోంది. వాల్తేరు వీరయ్య కంటే ఒ రోజు ముందే థియేటర్లోకి వచ్చేశాడు వీరసింహారెడ్డి. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దాంతో పండగ మొదలైంది.. వీరమాస్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రకటించారు మేకర్స్.
ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఏ థియేటర్ చూసినా.. పేపర్లు, డప్పుల మోతతో మోగిపోయాయి. బాలయ్య దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇక అనుకున్నట్టుగానే బాలయ్య హిట్ కొట్టేశాడు.. భారీ ఓపెనింగ్స్ రాబటట్డం ఖాయం.. దాంతో ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’పై పడింది. ఇంకొన్ని గంటల్లో.. థియేటర్లో మెగా మాస్ జాతర మొదలు కాబోతోంది. బాలయ్య ఫ్యాన్స్‌కు మించి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాభిమానులు. భారీ కటౌట్స్, బ్యానర్లతో థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. అలాగే బాలయ్య ఫ్యాన్స్ లాగే.. సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు. మరి వీరసింహారెడ్డి లాగే.. వాల్తేరు వీరయ్య కూడా థియేటర్లో పూనకాలు తెప్పిస్తాడేమో చూడాలి.