Dental treatment: ఇన్ఫెక్షన్..ఆస్పత్రికి లక్షల జరిమానా
ఓ 50 ఏళ్ల వ్యక్తి రూట్ కెనాల్ డెంటల్ ట్రీట్ మెంట్(Dental treatment) కోసం ఓ ఆస్పత్రి(hospital)కి వెళ్లగా వారు నిర్లక్ష్యంగా వైద్యం(treatment) చేశారు. కానీ అది అతనికి తెలియకపోవడంతో దాదాపు 6 నెలలు నరకం అనుభవించాడు. ఆ తర్వాత తెలుసుకన్న బాధితుడు ఆస్పత్రిపై కేసు వేశాడు. దీంతో కోర్టు ఆస్పత్రిపై జరిమానా విధించింది.
సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి డెంటల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్(Dental treatment) చేయించుకునేందుకు ఓ డెంటల్ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ అది కాస్తా వికటించి అతనికి ఏమి తినరాకుండా నోటి దవడ వాచిపోయింది. అంతేకాదు వారు నిర్లక్ష్యంగా చేసిన ట్రిట్ మెంట్ కారణంగా ఓ సూది రూట్ కెనాల్లో ఇరుక్కున్నా కూడా పట్టించుకోకపోవడంతో అతను క్లోవ్ డెంటల్ ఆస్పత్రిపై వినియోగదారుల ఫోరం కోర్టులో కేసు వేశారు. విషయం తెలుసుకున్న కోర్టు అతనికి రూ.2 లక్షల పరిహారంతోపాటు రూ.50 వేలు లిటిగేషన్ ఫీజు చెల్లించాలని జిల్లా వినియోగదారుల పరిష్కార వేదిక ఆదేశించింది.
ఇక వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన కేతన్ ఆర్.సంఘ్వి (50) అనే వ్యక్తి 2018 జనవరిలో దంత వ్యాధి కోసం కార్ఖానాలోని క్లోవ్ డెంటల్ను సందర్శించాడు. ఆ సమయంలో అతను రూట్ కెనాల్, దంతాల నంబర్ 3, 6కి టోపీని పెట్టుకోవాలని వారు సలహా ఇచ్చారు. ఆ తదుపరి పరీక్షలో అతని దంతాలన్నింటికీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్యాపింగ్ అవసరమని తేలింది. అందుకోసం రూ. 2,27,000 రూపాయలు అవుతాయని చెప్పారు. మొత్తం చికిత్స వివిధ దశల్లో పూర్తి చేయడానికి నాలుగు నెలలు పడుతుందని, దంతాలన్నింటికీ రూట్ కెనాల్ థెరపీ అవసరమని అన్నారు. అయితే అతని దంతాలకు తర్వాత దంతవైద్యులు చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. కేతన్ R. సంఘ్వీ కూడా త్వరగా కోలుకుంటానని ఆశించాడు. అయితే చికిత్స తర్వాత వెంటనే అతను తన ఎడమ దవడలో వాపును గమనించాడు. దాంతో అతని నోరు తెరవడం కష్టతరంగా మారింది. అతను ఏమీ తినలేకపోయాడు. ఫలితంగా అతను జనవరి 21, 2018న తిరిగి క్లోవ్ డెంటల్కి వచ్చాడు.
ఆ క్రమంలో దాదాపు ఒక వారం పాటు యాంటీబయాటిక్ వాడాలని వైద్యులు(doctors) సూచించారు. ఆ క్రమంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని అన్నారు. కేతన్ వారు సూచించిన వ్యవధిలో యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నాడు. కానీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. అసౌకర్యం, వాపు మరింత పెరిగింది. అతను మళ్లీ క్లోవ్ డెంటల్కి తిరిగి వచ్చాడు. మళ్లీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం కొనసాగించమని వైద్యులు చెప్పారు. కేతన్ సంఘ్వీ వారు సూచించినంత కాలం యాంటీబయాటిక్స్ తీసుకున్నాడు. కానీ అసౌకర్యం, వాపు పెరుగుతుంది. కానీ తగ్గలేదు. ఆ క్రమంలో అతను దాదాపు ఒక నెలపాటు మానసిక వేదన, భరించలేని బాధ, నొప్పితో బాధపడ్డాడు.
ఆ నేపథ్యంలో కేతన్ సంఘ్వి వాపును తట్టుకోలేక మళ్లీ ఆస్పత్రి(hospital)కి రాగా యాంటీబయాటిక్స్తో పాటు స్టెరాయిడ్ ఔషధం వైసోలోన్ను తీసుకోవాలని చెప్పారు. అయితే స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత, కేతన్ సంఘ్వీ దవడ దిగువ భాగం నుంచి తల వరకు నొప్పి నుండి ఉపశమనం పొందాడు. కానీ ఇప్పుడు అతను తన శరీరమంతా కీళ్ల నొప్పులతో పాటు కడుపు నొప్పి, మానసిక కల్లోలం గురించి ఫిర్యాదు చేశాడు. ఆ క్రమంలో పలువురు వైద్యులను సంప్రదించిన తర్వాత ముంబైలోని బైకుల్లాలో ఉన్న దంతవైద్యుడు డాక్టర్ అమర్సోని మిండేని సందర్శించారు. అప్పుడు కేతన్ సంఘ్వీ దెబ్బతిన్న సూది గురించి తెలుసుకున్నారు. ముంబైలోని దంతవైద్యుడు ఎక్స్-రే నిర్వహించి, గమ్లోని డ్రిల్, ఫైల్ సూది గురించి చెప్పారు. రూట్ కెనాల్ డెంటల్ ట్రిట్ మెంట్ నిర్లక్ష్యంగా చేయడం వల్లనే సూది విరిగిపోతుందని నిర్ధారించారు. అయితే పాడైన సూదిని తొలగించడంలో క్లోవ్ డెంటల్ పెద్దగా ఆసక్తి చూపలేదని, అయితే అతనిని పరీక్షించి, అజాగ్రత్తగా యాంటీబయాటిక్స్ వాడమని చెప్పి తనను ఇబ్బందలకు గురి చేశారని అతని వినియోగదారుల ఫోరంలో కేసు వేయగా..కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.