»Huge Se Scandal In Pakistan University Seize 5 Thousand Porn Videos
Big Scandal:యూనివర్సిటీలో విద్యార్థుల 5500 నగ్న వీడియోలు!
ఇస్లామియా యూనివర్సిటీలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కళాశాలలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా, వాటికి బానిసలుగా మారిన విద్యార్థినిలను లైంగికంగా వేధించారు.
Huge Se** Scandal in University Seize 5 thousand porn videos
Big Scandal: అదొక పవిత్ర విశ్వవిద్యాలయం. కానీ అక్కడ జరిగే తంతు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. విద్యార్థులకు విద్యను భోదించాల్సిన ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఆ చోటను భ్రష్టుపట్టించారు. లైంగిక చేష్టలకు ఆ ప్రాంతాన్ని అడ్డగా మార్చారు. ఆ దందాలో ఏకంగా 5 వేల మంది యువతుల నగ్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ తతంగంలో ఓ మంత్రి కుమారుడి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటన ఎక్కడో కాదు మన పక్క దేశమైన పాకిస్తాన్(Pakistanలో వెలుగులోకి వచ్చింది.
విద్యను భోదించాల్సిన యూనివర్సిటీలో వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులను లైగింక రాబంధులుగా మార్చుకుని ఆడుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5,500 మందిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన పాకిస్తాన్‌లోని ఇస్లామియా యూనివర్శిటీలో వెలుగులోకి వచ్చింది. ఈ వర్శిటీ సెక్స్ స్కాండల్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇలా వెలుగులోకి
ఓ వ్యక్తి మద్యం సేవించి ఓ బాలికను తన కారులో రాంగ్ రూట్లో తీసుకెళ్తుండగా బహవల్పూర్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. మత్తులో ఉన్న అతడిని చూసి పోలీసులు కారులో వెతుకగా గంజాయి సహా డ్రగ్స్ దొరికాయి. పోలీసులను చూడగానే డ్రైవర్ వెనుదిరగడానికి ప్రయత్నించగా పోలీసులు అక్కడికక్కడే పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సయ్యద్ ఎజాజ్ హుస్సేన్ షాగా గుర్తించారు. దీంతో నగర పోలీసులు నార్కోటిక్ నియంత్రణ చట్టం కింద కేసు అతనిపై నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ తర్వాత విచారణలో భాగంగా ఆ ఫోన్లను తనిఖీ చేయగా వాటిలో 5500 విద్యార్థినుల లైంగిక వీడియోలు బయటపడ్డాయి. వాటి గురించి అతన్ని ప్రశ్నించగా.. హుస్సేన్ షా, రిటైర్డ్ ఆర్మీ మేజర్ కలిసి ఇవి తీసినట్లు ఒప్పుకున్నాడని అధికారులు పేర్కొన్నారు.
ఇలా దందా
ఆ క్రమంలో బాలిక తల్లిదండ్రులను పిలిపించి బాలికను పోలీసులు వారికి అప్పగించారు. ఆ నిందితుడు, యునివర్సిటీ విభాగాధిపతి కలిసి వర్సిటీలో ముఠాగా ఏర్పడి ఈ దందా చేసినట్లు పోలీసులు తేల్చారు. వర్సిటీలోని యువతులను ఉద్యోగాలు, పాస్ చేయిస్తామని మార్కుల పేరుతో కామ వాంఛ తీర్చుకుని వీడియోలు తీసినట్లు నిందితుడు తెలిపాడు. ఆ క్రమంలో వారి నగ్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. పలువురు ఉపాధ్యాయులు కూడా అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వారిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు, వాటిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అమ్మాయిలనే టార్గెట్ చేసి చాలా ఏళ్లుగా ఈ రాకెట్ ను నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
చదవండి:Floods: భద్రకాళి చెరువుకు గండి
డ్రగ్స్ దందా
ఈ వ్యవహారంలో పాకిస్తాన్ మంత్రి చౌదరి తారిఖ్ బషీర్ చీమా కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. ఇస్లామియా వర్సిటీలో డ్రగ్స్ దందాలో అతని ప్రమేయంతో వందలాది మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగాయని అంటున్నారు. మరోవైపు చౌదరి తారిఖ్ బషీర్ చీమా కుమారుడితో సహా ప్రభావవంతమైన ముఠా సభ్యులతో మేజర్ ఇజాజ్ షా విద్యార్థినులను వారి ఇళ్లలో లైంగిక దోపిడీకి గురిచేశారని గ్లోబల్ విలేజ్ స్పేస్ నివేదిక పేర్కొంది. మంత్రి చీమా(Chaudhary Tariq Bashir Cheema) తన కుమారుడిని రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
ముగ్గురి అరెస్ట్
ఈ విచారణలో ఇప్పటి వరకు ముగ్గురుని అరెస్ట్ చేయగా వారి ఫోన్లలో విద్యార్థులతో అసభ్యకరమైన చాటింగ్‌తోపాటు వారి అశ్లీల చిత్రాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు ఇస్లామియా వర్శిటీ స్కాండల్ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ అంశంపై విచారణ చేస్తున్నారు. మరోవైపు ఇస్లామియా యూనివర్శిటీ బహవల్పూర్ కూడా ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి పాకిస్తాన్ ఉన్నత విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
పేరంట్స్ ఆందోళన
ఇస్లామియా యూనివర్శిటీ(Islamia University) స్కాండల్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో యూనివర్శిటీ క్యాంపస్‌లలోని విద్యార్థుల భద్రత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన కాలేజీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేధావులు, రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.