పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి భారత్(india alliance) నిర్ణయించినట్లు తృణమూల్ కాంగ్రెస్(TMC) వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలు తమ బోర్డులో ఉన్నాయని, రాజ్యసభలోను తమ వ్యూహం కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)లోని సభ్యుల సమావేశంలో నోటీసును సమర్పించే ప్రతిపాదనపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు మణిపూర్(manipur violence)లో జరిగిన హింసాకాండపై ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. మణిపూర్‌పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ప్రతిపక్ష వ్యూహం రాజ్యసభలోనూ కొనసాగుతుందని సంబంధిత వర్గాలు అన్నాయి. చివరిసారిగా 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టారు.