Indian shuttler Satwik Ranky Reddy Guinness Record
Guinness Record: భారత స్టార్ షట్లర్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి(Satviksairaj Ranki Reddy) గిన్నిస్ రికార్డు(Guinness Record) సాధించాడు. రెండు దశాబ్దాలుగా చెక్కు చెదరని వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి ప్రపంచంలో ఫాస్టెస్ట్ బ్యాడ్మింటన్ హిట్ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. సాత్విక్ స్మాష్ చేసి షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న జపాన్ లోని యూనెక్స్ ఫ్యాక్టరీ వ్యాయామశాలలో నియంత్రణ వాతావరణంలో రాంకీరెడ్డి స్మాష్ స్పీడ్(Smash Speed) ను రికార్డ్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఫార్ములా 1 కారు టాప్ స్పీడులో వెళ్తే 372.6 కిలోమీటర్లు వెళ్తుంది. దీని కన్నా కూడా రాంకీరెడ్డి షాట్ 190 కిలోమీటర్లు వేగంగా ఉండటం గమనార్హం.
అంతకు ముందు ఈ రికార్డు బ్యాడ్మింటన్(Badminton)లో అత్యంత వేగవంతమైన షాట్ కొట్టిన ప్లేయర్‌గా మలేషియా స్టార్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ టాన్ బూన్ హాంగ్ పేరిట ఉండేది. అతను గంటకు 493 కిలోమీటర్ల వేగంతో షాట్ బాదాడు. ఇప్పుడు సాత్విక్ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇక మహిళా విభాగంలో మలేషియా ప్లేయర్ టాన్ పెర్లీ గంటకు 438 కిలోమీటర్ల వేగం తన పేరు మీదుంది. ఈ జిమ్నాజియం ప్రతినిధులు చెప్పిన ప్రకారం ఇంపాక్ట్ జరిగిన క్షణాలు హై-స్పీడ్ కెమెరాల్లో బంధిస్తారు. ఆ తర్వాత ఫొటోగ్రాఫిక్ రికార్డింగ్ సాయంతో షటిల్‌కాక్ వేగాన్ని లెక్కిస్తారు. ఈ రికార్డ్ బ్రేకింగ్ షాట్ కొట్టే సమయంలో సాత్విక్ యానెక్స్ నానోఫ్లేర్ 1000 జడ్ రాకెడ్ వాడినట్లు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జపాన్లని సోకాలో ఉన్న యానెక్స్ ఫ్యాక్టరీ జిమ్నాజియంలో ఈ ప్రయోగం నిర్వహించారట.