Overflowing waterfalls in Telangana.. Visitors flocked to see Bogata waterfall
Bogata waterfall: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం సందర్శకులతో సందడిగా ఉంది. జలాశయాన్ని చూడటానికి జనం పొటెత్తారు. తమ మొబైల్స్‌తో ఆ దృష్యాలను బంధించి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇక నీటిలోకి ఎవరు దిగవద్దని పర్యాటకులకు అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్‌లో గల కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, అసిఫాబాద్‌లోని సప్తగుండాల జలపాతాలు జలకళగా మారాయి.