»A Minor Was Raped After Drinking A Cool Drink At Gurugram Uttarpradesh
Cool drink: తాగించి మైనర్ పై అత్యాచారం!
ఓ వ్యక్తి తన తోటి యువతి(minor girl)ని తన ఇంటికి ఆహ్వానించాడు. అంతటితో ఆగలేదు. ఓ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొన్న తర్వాత తెలుసుకున్న యువతిని అతను ఎవరికీ చెప్పొద్దని చెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ 16 ఏళ్ల బాలిక(minor girl)కు కూల్ డ్రింక్(cool drink)లో మత్తు మందు కలిపి ఇచ్చి 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడ్డు. ఈ సంఘటన గురుగ్రామ్(gurugram)లో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ బొమ్మల ఫ్యాక్టరీలో పనిచేసే యువతితోపాటు మరొ యువకుడు కూడా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో జూన్ 29న బాధితురాలిని ఆ యువకుడు గురుగ్రామ్‌లోని తన సోదరుడి ఇంటికి తీసుకెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తెలిపింది. అక్కడ అతను ఆమెకు శీతల పానీయం ఇచ్చాడని, ఆ తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయిందని తెలిపింది. కానీ ఆమె లేచి చూసే సరికి ఆమె శరీరంపై బట్టలు లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఆ క్రమంలో ఈ ఘటనను ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ఆ క్రమంలో నిందితుడు ఆ విధంగా రెండు మూడుసార్లు చేశాడని, బయటపెట్టకుండా ఉండేందుకు బ్లాక్మెయిల్ చేశాడని కూడా ఆమె చెప్పింది.
ఆ నేపథ్యంలోనే బాధితురాలు జూలై 1న పోలీసుల(police)ను ఆశ్రయించిందని ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ఔటర్ డిస్ట్రిక్ట్ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. అయితే ఆ అమ్మాయిపై సల్మాన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. జులై 1న PS ముండ్కాలో IPC రేప్ & POCSO చట్టం కింద కేసు నమోదు చేయబడింది.