మణిపూర్ సీఎం ఎన్. బీరేన్‌సింగ్ (CM N. Birensingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హింస వెనక విదేశీ శక్తుల కుట్ర ఉండొచ్చని అనుమనం వ్యక్తం చేశారు. రాష్ట్రం మయన్మార్(Myanmar), చైనాతో సరిహద్దులు పంచుకుంటోందని, దాదాపు 398 కిలోమీటర్ల సరిహద్దులో కాపలా లేదని బీరేన్ సింగ్ తెలిపారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అల్లర్లు ‘ప్రీ ప్లాన్డ్(Pre Planned) అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.జాతుల మధ్య కొనసాగుతున్న వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్(Manipur)లో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించినప్పటికీ ఎక్కడో ఓ చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే, ఎందుకు? అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. జాతి ప్రాతిపదికన చీల్చేందుకు తాను అనుమతించబోనని, అన్ని తెగలు కలిసిమెలసి జీవించాలని పిలుపునిచ్చారు. మే 3న మీటీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU)
నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు – నాగాలు, కుకిలు – జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.