Rajamouli: రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వైరల్ వీడియో
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి అంటే.. ఓ బ్రాండ్‌గా మారిపోయింది. రాజమౌళి అంటే తెలియని వారు లేరనే చెప్పాలి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు జక్కన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే పబ్లిక్ మీటింగ్స్‌లో పెద్దగా కనిపించడం లేదు. కానీ రాజమౌళి ఓల్డ్ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అందులో జక్కన్న చేసిన కొన్ని కామెంట్స్ షాకింగ్‌గా ఉన్నాయి.
బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ కొట్టేసి.. చరిత్ర సృష్టించాడు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా చేయబోతున్నాడు రాజమౌళి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ కమిట్ అయిపోయాడు జక్కన్న. హాలీవుడ్ రేంజ్లో రాబోతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ.. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని వినిపిస్తోంది. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే.. గతంలో తన ప్రేమ, పెళ్లి పై రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజమౌళికి తోడు నీడగా, నిత్యం తన వెంటే ఉంటూ సక్సెస్‌లో సగం వాటా తనదేనని ప్రూవ్ చేస్తోంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. ఇదే విషయాన్ని జక్కన్న చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. కానీ గతంలో ఓ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. భార్య రమాతో ప్రేమ, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. రమా 1991, 92లో నేను డైరెక్టర్ అవుదామని అనుకున్నాను.. కానీ, మధ్యలో ఓ 8 నెలల నుంచి సంవత్సరం వరకు ఆ కాన్ఫిడెన్స్ పోయింది. డైరెక్టర్‌గా పైకి రాకపోతే ఎలా? ఏదైనా ఉద్యోగం చూసుకోవాలా? అని అనుకున్నాను. దానికి కారణం.. తాను లవ్‌లో పడ్డానని.. స్టేజ్ పై నవ్వులు పూయించాడు.
అయితే ఆ తర్వాత మాత్రం ఎప్పడూ ఆ భయపడలేదు. ప్రేమంటే భయం కాదు.. బాధ్యత. సినిమా అనేది నిలకడ లేనిది.పెళ్లి, పెటాకులు అనుకుంటే ఆ రెండిటికీ చుక్కెదురేనని చెప్పుకొచ్చాడు. ఇక ప్రేమ గురించి చెబుతూ.. నిజానికి నాది ప్రేమ కాదు.. అదొక అట్రాక్షన్. మా మధ్య గొడవలు రాకుండా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాను. సినిమా విషయంలో నా పక్కన ఉండి సపోర్ట్ చేయాలని రమకు చెప్పాను. అంతేకాదు.. వేరే లవ్ మ్యాటర్‌ను కూడా ఆవిడను పంపించి క్యాన్సిల్ చేశానని.. అని అన్నారు. అయితే ఉన్నట్టుండి ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అర్థం కాని విషయమే.