VSP: రామచంద్రపురంలో ఈనెల 22, 23వ తేదీల్లో జరిగే ఏపీ అంతర్ జిల్లాల 3×3 పురుషుల, మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు విశాఖ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తామని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ మహంతి తెలిపారు. ఈనెల 19న సాయంత్రం 4:30 గంటలకు విశాలాక్షినగర్ బి.వి.కె హైస్కూల్ గ్రౌండ్‌కి రావాలన్నారు. అలాగే క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు.