NLG: చిట్యాల పట్టణానికి చెందిన శివాలయం కమిటీ ఛైర్మెన్ రంగ వెంకన్న మాతృమూర్తి రంగ వెంకమ్మ వృద్ధాప్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యేతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.