KMM: జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు, 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైనీ తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.