NRPT: ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన భీమ్ వారియర్స్ టీమ్ అనారోగ్యంతో చికిత్స ఎదురుచూస్తున్న స్నేహితుడు వెంకటేశ్ కుటుంబానికి తమ ప్రైజ్ మనీ రూ.10,000 అందజేస్తూ ఆదర్శనీయత చూపించారు. పట్టుబట్టి గెలుపు సాధించడంతో పాటు కష్టకాలంలో స్నేహితుడి కోసం అండగా నిలవడాన్ని గ్రామస్థులు సంతోషంతో అభినందించారు.