SRPT: మునగాల మండలం కొక్కిరేణిలో సంక్రాంతి సందర్భంగా కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. DYFI, SFI, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభను చాటారు. విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. యువతలో ఐక్యత, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడోత్సవాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.