ఉమెన్స్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకుంది. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల ఖాతా తెరవాలని యూపీ భావిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై 3 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.