హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలకు బ్రేక్ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,43,180కు, 22 క్యారెట్ల ధర రూ.750 తగ్గి రూ.1,31,250కు చేరింది. అయితే వెండి మాత్రం ఇవాళ కూడా పెరిగింది. ఒక్కరోజే రూ.3,000 పెరిగి కిలో వెండి ధర రూ.3,10,000కు చేరింది. వెండి చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డు కావడం గమనార్హం.