గుంటూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు జరుగుతాయని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30నిమిషాల వరకు డయల్ యువర్ కమిషనర్, అనంతరం పీజీఆర్ఎస్ (0863-2224202) కార్యక్రమం ప్రారంభం జరుగుతుందని చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.