నల్గొండలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (లోయర్, హయ్యర్ గ్రేడ్ లో డ్రాయింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ) పరీక్షలు రెండవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 1116 మంది అభ్యర్థులకు 875 మంది హాజరు కాగా, 241 మంది గైర్హాజరయ్యారని డీఈవో భిక్షపతి తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 993 మంది అభ్యర్థులకు గాను 760 మంది అభ్యర్థులు హాజరయ్యారు.