SRD: ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైకుంఠాపురం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో వెంకటేశ్వర స్వామి రథయాత్ర ఆదివారం నిర్వహించారు. దేవాలయ అర్చకులు వరదాచార్యులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద రథయాత్రను ప్రారంభించారు. భక్తులు రథయాత్ర తాడును లాగుతూ జై శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.