KNR: బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లాలో తప్పకుండా కలుస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జిల్లాల సరిహద్దుల మార్పుపై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జిల్లాల కూర్పు, మండలాల మార్పులు చేపడతామని, త్వరలోనే పునర్విభజన జరుగుతుందని ప్రకటించారు.