TG: హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో చైనా మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి చేతికి మాంజా చుట్టుకోవడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చైతన్యకు తీవ్రగాయాలయ్యాయి. కాగా సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు చైనా మాంజా ఉపయోగించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.