WGL: చెన్నారావుపేట మండలం అక్కల్చెడ్ గ్రామానికి చెందిన యువకుడు భూక్య ప్రకాష్ తన అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒడిశాలోని కటక్‌లో జరిగిన 33వ జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. మారుమూల గ్రామంలో జన్మించి కష్టాల మధ్య ఎదిగిన ప్రకాష్ జాతీయ స్థాయిలో ఈ విజయం సాధించడం గ్రామస్థులకు తీరని గర్వకారణంగా మారింది.