కృష్ణా: సంక్రాంతి నాటికి గ్రామాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతామని మంగళాపురం సర్పంచ్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం చల్లపల్లి మండలం మంగళాపురంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సర్పంచ్, కార్యదర్శి మాధవేంద్రరావు ఆధ్వర్యంలో రహదారులకు ఇరువైపులా పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. గ్రామ సరిహద్దులో ‘స్వచ్ఛ మంగళాపురం’ బోర్డును ఏర్పాటు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని పేర్కొన్నారు.