అనంతపురం పట్టణ కేంద్రంలో వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతి సందర్భంగా ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో భేటీ అయ్యారు. వడ్డే ఓబన్న సేవలను స్మరించి, ఆయన ఆశయాలను యువతకు చేరవేయాలని మంత్రి పిలుపునిచ్చారు.