ప్రకాశం: ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎర్రగొండపాలెం వచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నాయకులు రానున్నారు.