KNR: చిగురుమామిడి మండల పరిధిలో పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నిర్వహించారు. పట్టా పాస్ బుక్ కలిగి ఉన్న ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి జె.భాగ్యలక్ష్మి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న పీఎం కిసాన్, తదితర పథకాలలో అర్హత పొందాలంటే ప్రతి రైతుకు గుర్తింపు నంబరు ఇస్తామన్నారు.