ఆత్మజ్ఞానం, కార్యసాధనలో సామర్థ్యం, ఓర్పు, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకపోవడం… అనే ఈ లక్షణాలు ఎవరినైతే తమ లక్ష్యం (పురుషార్థం) నుంచి పక్కకు మళ్లించవో, వారినే నిజమైన ‘పండితులు’ అని అంటారు. దుర్యోధనుడి వంటి వారికి ఈ లక్షణాలు లేవని విదురుడు స్పష్టం చేశాడు.