W.G: సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలు, పేకాట అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై నసీరుల్లా సూచించారు. శనివారం ఎన్ఆర్పీ అగ్రహారం, కోలమూరు గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహించేలా క్రీడా పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించుకోవాలని కోరారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.