KRNL: మంత్రాలయంలో ప్రైవేటు వసతిగృహ నిర్వాహకులకు సీఐ రామాంజులు పలు హెచ్చరికలు జారీ చేశారు. భక్తుల నుంచి అధిక నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గదులు కేటాయించిన భక్తుల వివరాలు, పూర్తి చిరునామా తదితర వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. భద్రత నిమిత్తం కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలన్నారు.