నందలూరు బస్టాండ్ నుంచి R&B రోడ్డుకు వెళ్లే మార్గం దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల స్పందన లేకపోవడంతో గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ చొరవ తీసుకుని డస్ట్ చిప్స్‌తో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులు స్పందించాలని ఆయన కోరారు.