ELR: ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద శనివారం 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా 41 మంది టోల్ ప్లాజా సిబ్బంది రక్తదానం చేసారు. ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్ సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.