CTR: కుప్పం విమాన ఆశ్రయం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అందించిన రైతులకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అభినందనలు తెలిపారు. 257 ఎకరాల భూమిని 132 మంది రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. అనంతరం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు రూ.59 కోట్ల చెక్కులను అందజేశారు. రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భూములందించిన రైతులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.