TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలువురికి సీఎం సహాయ నిధి కింద రూ: 47.60 లక్షలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కులను టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పులివర్తి నాని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.