MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని డివిజన్‌కు చెందిన ఓంకార్ గౌడ్ దరఖాస్తు సమర్పించారు. శనివారం ఈ దరఖాస్తు ఫారమ్‌ను పట్టణ అధ్యక్షుడు శివరాజ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకై కృషి చేసే పార్టీగా ఉండటంతో, ఈ పార్టీతోనే ప్రజలకు సంక్షేమం సాధ్యమని అన్నారు.