NLG: వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడలో ‘నో హెల్మెట్..నో పెట్రోల్’ అనే నినాదంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైకర్లకు ఉచిత హెల్మెట్ల పంపిణీని చేశారు.