TPT: తిరుచానూరులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వడమాలపేట మండలానికి చెందిన శ్రీరాములు దేశయ్య అలియాస్, నాగరాజుగా నిందితుడిని గుర్తించారు. ఈ నెల 2వ తేదీన వేమూరు పంచాయతీ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం రిమాండుకు తరలించారు.