సత్యసాయి: పుట్టపర్తిలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా జరపాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. పరేడ్ మైదానంలో ఏర్పాట్లు, భద్రతపై ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రగతిని చాటేలా అభివృద్ధి శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.