WGL: సంగెం మండల కేంద్రంలోని KGVB విద్యాలయంలో శుక్రవారం కలెక్టర్ డా. సత్య శారద, స్థానిక అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. వంట సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం కనిపించడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి కొత్తవారిని నియమించాలని ఆదేశించారు.