ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ WPLలో తన అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టింది. RCB తరఫున ఆడుతున్న ఆమె.. తన తొలి మ్యాచ్లోనే బౌలింగ్లో నిప్పులు చెరిగింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బెల్, ఏకంగా 19 డాట్ బాల్స్ వేసి 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీసింది. దీంతో WPL చరిత్రలో RCB తరఫున ఒకే మ్యాచ్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా బెల్ రికార్డ్ సృష్టించింది.